పోస్ట్‌లు

జనవరి, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

మునుపటి రోజులు

  నాటి   రోజులు   గుర్తుకొచ్చెలే నేటితో   నాటికి   పోలిక   లేదులే ! అస్సలు   లేదు   చదువు   ఒత్తిడి ఆటలు   లేవు   మట్టి   ముట్టక ! చేతిలో   లేదు   స్మార్ట్   ఫోను చురుకుగా   ఉండే   బుర్రెప్పుడూ !  వల్లె   వేసాము   ఎక్కాలను వద్దకు   రాలే   మతిమరుపన్నదే !  । నా। కాలి   నడకనే   ఎక్కడికైనా కావలిసినంతా   సమయముండెలే !  టీవీ   ఉన్నా   ఒకటే   ఛానల్ టైం   వేస్టుకు   ఛాన్స్   తక్కువే ! ఉత్తరాలతో   యోగక్షేమం ఆత్రానికి   ఆమడ   దూరం ! బాటిల్   నీళ్ళ   ఊసే   లేదు బాగుగా   ఉండే   బావిలో   నీళ్ళే !  । నా। అల్పాహారం   అప్పుడప్పుడు అన్ని   వేళల   అన్నం   మాత్రమే ! పిజ్జా   బర్గర్   అంటే   తెలియదు పండగలప్పటి   పిండివంటలే ! పెద్దలంటే   భయం   భక్తి పెద్దల   మాటకు   ఎదురు   చెప్పలే ! నాటి   రోజులు   గుర్తుకొచ్చెలే నేటితో   నాటికి   పోలిక   లేదులే !