పోస్ట్‌లు

జూన్, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

తాతయ్య!

  #1: తాతయ్యా !  నా   జీవిత   పుస్తకంలో   నీది   ఒక   ముఖ్యమైన   పాత్ర ప్రతి   పాఠంలో   భాగమైనావు   ప్రతి   పుటలో   స్పురణకొస్తావు పాలు   త్రాగే   పసితనం   నుంచి  పెంచి పెద్దవాడిని  చేసావు నన్ను నా పై  కురిపించావు   నీ   ప్రేమనెంతో నేనేది  సాధించినా   నీదిగా   ఆనందపడ్డావు నలుగురికి   గొప్పగా   చెప్పుకున్నావు నేనేమిచ్చి   తీర్చుకోగలను   నీ   ఋణం ఆగకుండా   కారుతున్న   అశ్రువులు   తప్ప ! #2: రమ్మని పిలిచే   గొంతు   మూగబోయెలే అక్కున   చేర్చుకునే   చేతులు   కదలకుండెలే ఆప్యాయత   నిండిన   గుండె   ఆగిపోయెలే చిరునవ్వుల   మోమున   శాశ్వత   నిద్రనిండెలే ! #3: కనికరం   లేని   కాలం   కాటు   వేసింది మానుంచి   నిను   మాయం   చేసింది మా   మధ్య   నీవు   మరి   లేకపోయినా   మాలోనే   ఉన్నావు   మాతోడై   ఉంటావు కొండంత   నీ   స్మృతులు   కలకాలముండగ కటువైన   నిజాన్ని   కలలా   మరిచిపోలేము కలిగిన   వ్యధను   కన్నీటితో   కరిగించలేము! #4: అనగనగ   ఒక   చిన్న   దీవి ,  దాని   పేరు  ‘ కష్టం ’ ‘ కష్టం ’ ను   ఎపుడూ   వరదలు   ముంచు దానిలో   ఉండే   ఒక   పేద   కుటుంబం కుటుంబ   భారం   మోసే   పెద్ద రేపటి   రోజు   బాగు   కోసము  

పెండ్లి (ఒకటైన ఏడడుగుల బంధం)

  సప్తపదుల   స్వాగతాన   షడ్రుచుల   కాపురానికి పంచ   భూతాల   సాక్షిగా   చతుర్వేదాల   ఘోషలో   మూడు   ముళ్ళ   బంధంతో   ఇద్దరు   ఒకటవగా కన్నుల   పండుగగా   నాటుకునే   నూరేళ్ళ   పంట !