పోస్ట్‌లు

నవంబర్, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

మన హైదరాబాదు

  చుట్టుముట్టూ   చూపు   తిప్పుకోలేని   ఆకాశహర్మ్యాలు నట్టనడుమ   పంచ   శతాబ్ధాల   కట్టడాలు కొత్త   పోకడల   నడుమ   పదిలముగ   పాత   జ్ఞాపకాలు   విభిన్న   మతాల   వివిధ   రాష్ట్ర   వాసుల   సంగమం నిజమైన   భారతీయం   మన   హైదరాబాదు ! ————- అటు   చూస్తే   ఆకాశ   హర్మ్యాలు ఇటు   చూస్తే   ఇరుకైన   బస్తీలు అబ్బుర   పరిచే   నెక్లెస్   దారులు ఆదమరిస్తే   కబళించే   నాళాలు భాగ్య   నగరం   భిన్నత్వాల   ఏకత్వం ! ———— కిక్కు   కిక్కంటూ   కుర్రకారు   వెర్రివేషాలు నరనరానా   పారించె   మాదకద్రవ్యాల   జోరు ముత్యాల   నగరంపై   మత్తు   మరకలు   మసకబారుస్తుండె   మునపటి   చరితను ! ———- వారెవ్వా !  భాగ్యనగరం ఎచ్చులకే   విశ్వనగరం ! వొచ్చిందా   మోస్తారు   వర్షం అయిపోవు   దారులేరులే ! నాలాలు   పొంగిపోవు ట్రాఫిక్కు   ఆగిపోవు ! వారెవ్వా !  భాగ్యనగరం ఎచ్చులకే   విశ్వనగరం ! ——— బిజీబిజీ   పరుగుల   గజిబిజి   పయనం నగర   జీవితం   నరక   ప్రాయం ! చిల్లు   పడినదా   మబ్బులకు చుక్కలు   కనపడు   మనుషులకు ! —— చెరువులు   నాళాలు   చెరపట్టి   బకాసురులు అమాత్యుల   అండన   అడ్డగోలు   కట్టడాలు చిల్లు   పెట్టుకొని   ఆకాశం   చూపించే   తన   కో

రాజకీయాలు

  ఏ పార్టీలో ఉంటారో, నేతలకు లేదు క్లారిటీ పొత్తులెలా ఉంటాయో, పార్టీలకు లేదు క్లారిటీ ఎందుకు ఓటేస్తున్నాడో, ఓటరుకు లేదు క్లారిటీ ప్రజాస్వామ్య పెద్దన్న దేశంలో, ఉన్నదొక్కటే క్లారిటీ ఇస్తినమ్మా వాయనం, పుచ్చుకుంటినమ్మా వాయనం! ——- ఓరి ఓటరు దేవుడో ఓటు నాకు వేయరో కోట్లు ఖర్చు పెడితినీ కొంప ముంచబోకురో! బీరు సీసాలు బిర్యానీ పొట్లాలు అప్పనంగా ఆపైనా పైసలిస్తినే అసలు ఎవరైనా నాలాగా అరుసుకుంటరా కనుక నీ ఓటు నాకెయ్యి ఓరి నాయనా ॥ఓ॥ —— ఓట్ల పండుగ వచ్చిందంటే  ఓరి నాయనో సూడు సిత్రాలు! ఉద్దరించేది మేమేనంటూ  ఊదరగొట్టే ఊసరవెల్లులు! అద్భుతమైన మేనిఫెస్టోలు అడగకుండానే అన్నీ ఉచ్చితం! ప్రజా సేవంటు పైపై మాటలు పైస పెత్తనం అంతిమ లక్ష్యం! ॥ఓ॥ ——- పెరుగుతున్న ధరల ప్రశ్నించే గొంతేది? దారిద్ర్య నిర్మూలనకు దారులెతికేదెవరు? ఉపాధి కల్పన గూర్చి ఊసెక్కడున్నది? రోజుకో అనవసరపు రచ్చతో రాజకీయాల రొచ్చు! తైతక్కల మీడియా తానా అంటే తందానా! ——- అందరికీ   న్యాయం   అంతటా   స్వేచ్ఛా   సమానత్వం మన   రాజ్యాంగం   మనకిచ్చిన   భరోసా   బాధ్యత ఆచరిస్తున్నామా   మనసా   వాచా   కర్మణా ?  ——- అడ్డగోలు   ధరలకు   ఆకాశమే   హద్దు రైల్లల్లో   వృద్ధులకు