పోస్ట్‌లు

ఏప్రిల్, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

నమ్మకమున్నది నాకెంతో

  మానవాళిపై   దురాక్రమణ   మనుగడ   కోసం   పోరాటం చరిత్ర   నేర్పన   పాఠాలుండగ చింతించాల్సిన   అవసరమేల ! పదండి   ముందుకు   ప్రణాళికతో పోరాడేద్దాం   కరోనాతో కలసికట్టుగ   అందరు   చేరగ కదనరంగమున   మనదే   విజయం ! క్రమశిక్షణతో   కార్యదీక్షతో కొండలనైనా   పిండిచేయగల మెండుగ   ఉన్న   గుండె   ధైర్యముతో మహమ్మారిని   జయించేద్దాం ! నమ్మకమున్నది   నాకెంతో నాటి   రోజుల   మేటి   బ్రతుకులు రేపటి   రోజున   ఉదయిస్తాయని రేపు   అన్నది   దూరము   లేదని !

మారుదాము ఇకనైన మార్పు తీసుకొద్దాము

  మారము   మనము   మారము   మనము మంచి   మాటలెప్పుడూ   తలకెక్కవు   మనకు ! కరోనా   మహమ్మారి   నలుమూలల   కమ్ముతున్న కానరాదు   మనలోన   ఉండాల్సిన   క్రమశిక్షణ ! మనకేమీ   కాదన్న   మితిమీరిన   నమ్మకంతో ఉత్సవాలు   చేస్తాము   ఊరేగుతు   ఉంటాము ! || మా || మాస్కులేసుకుంటాము   మూతి   ముక్కు   కానరాగ గుంపులుగ   వెళుతాము   గొర్రెల   మందలుగ ! పనీపాట   లేకున్నా   పచారాలు   చేస్తాము మహమ్మారి   కరోనాని   మన   వెంట   తెస్తాము ! || మా || ఒళ్ళు   గుల్ల   ఇల్లు   గుల్ల   ఒంటరిగా   మన   బ్రతుకు ఇమ్యూనిటి   లేకపోతే   ఐసీయు   లో   మన   పడక ! ప్రాణవాయువు   అందకా  .... ప్రాణవాయువు   అందక ప్రాణం   పోయిందంటే చుట్ట   కట్టి   కాల్చేస్తరు   చివరి   చూపు   లేకుండ ! మారుదాము   ఇకనైన   మార్పు   తీసుకొద్దాము మనకోసమే   కాకుండా   మనవారి   కోసమంటు ! పాటిద్దాం   నియమాలను   తు . చ .  తప్పకుండగ పనిపడదాం   మహమ్మారి   పీడ   విరగడైపోగ !

ఎళ్ళిపోవె కరోనా నువ్వెళ్ళిపోవె కరోనా

  ఎళ్ళిపోవె   కరోనా   నువ్వెళ్ళిపోవె   కరోనా ఎళ్ళిపోయి   మల్లెప్పుడు   రామాకే   కరోనా పిలవని   పేరంటంలా   పనికట్టుక   వస్తివి చైనా   గోడను   దాటి   చేరినావే   ఈడన  || ఎ || మా   ఎండకి   మా   వేడికి   నీ   పని   ఖతమని నువ్వేమీ   పీకవని   నీ   ఆటలు   సాగవని   కాకుంటే   లేకుంటే   మందుగోలి   చాలునని   బలాదూరు   తిరిగినాము మాస్కులేమి   లేకుండ  || ఎ || అంచనాలు   మారిపోయే   ఆపదేమో   ముంచుకొచ్చే వాడు   దగ్గె   వీడు   తుమ్మె   ఆడ   ఈడ   అడ్డగోలుగ వాడినుంచి   వీడికొచ్చె   వీడినుంచి   వాడికొచ్చె ఒకరొకరికి   అంటుకుంటు   ఊరంత   గత్తరెక్కె   || ఎ || రోగమంటు   నొప్పి   అంటు   దవాఖానకెళ్ళినాక రకరకాల   పరిక్షలతో   జేబు   గుల్ల   చేసిండ్రు బెడ్డులేవి   లేవంటూ   బయటకు   పంపిండ్రు ప్రాణవాయువందక   పాణం   పోయేట్టుంది ! || ఎ ||

రామా కనవేమయా!

  రామా   కనవేమయా   ఓ రఘురామ   కనవేమయా  ... రామా   కనవేమయా ! ఆ   రాకాసి   కరోనాని   అది   చేసే   విలయాన్ని ఈ   జనుల   బాదను   ఇకనైన   ఆపేయ  || రా || నీ   యందు   భక్తితో   ఈ   భక్త   సందోహం ఏ   బాదలెంతున్న   నీ   సేవ   మానలే ! ఏ   లోటు   రాకుండా   ఏమారి   పోకుండా నీ   పూజ   చేశారు   ఈ   నవమి   నాడు ! || రా ||  నీ   పేరు   అనుకుంటే   ఏ   కీడు   రాదన్న నీ   కథలు   విన్నాము   ఈ   కనులైతే   కనలేదు ! నీ   మహిమ   చూపెట్టు   నీ   వారి   దయతోడ నీ   శరము   గురిపెట్టు   ఈ   రాకాసి   వథ   పట్టు ! || రా ||

ఘోరకళి

కోరలు   చాచిన   కరోనాగ్నిలో ఊపిరి   ఆడక   ఉసురుపోయిన విగత   జీవుల   విషాద   గాధలు ఆప్తులు   చేసే   ఆక్రందనలు ! ఒకటా   రెండా   వందలు   వేలు ఒకటిగ   పేర్చిన   శవాల   గుట్టలు వల్లకాడే   నా   వల్లకాదంటూ వైరాగ్యం   వీడి   విలపించెను నేడు! ఎవరిదీ   పాపం   ఎందుకీ   శాపం ఇంకెన్నాళ్ళూ   ఈ   ఘోరకళి బ్రతుకు   ఆశలు   బరువైతుండగ అలిసిన   గుండె   ఆగిపోనుందిగ !

ఎంత కష్టం ఎంత కష్టం!

  కూటి   కోసం   కూలి   కోసం కన్న   వారిని   వదలిపెట్టి కన్న   ఊరిని   విడిచిపెట్టి బయట   రాష్ట్రం   వెళ్ళిపోయిన బతికి   చచ్చిన   బీదవాడా ఎంత   కష్టం   ఎంత   కష్టం ! నలుగురున్న   ఇంటిలోన నాలుగు   పైసలు   కూడబెట్ట రెండు   పూటల   కూడుపెట్ట రేయి   పగలు   కష్టపడుతూ చచ్చి   బతికిన   చిన్నవాడా ఎంత   కష్టం   ఎంత   కష్టం ! మాయదారీ   కరోనాతో మారిపోయిన   జీవనంలో పగలు   రేయి   పనుల్లేక తినాలంటే   తిండిలేక పస్తులుండిన   పేదవాడా ఎంత   కష్టం   ఎంత   కష్టం ! కన్న   ఊరిలో   కన్న   వారితో కలో   గంజో   తాగుదామని కట్టుబట్టన   కుటుంబంతో బయలుదేరే   కాలి   నడకన బతుకు   పోరున   ఓడినోడా ఎంత   కష్టం   ఎంత   కష్టం !

నా గుండె లోతుల్లో

ఏదో అయ్యిందిలే              నాకేదో అయ్యిందిలే ఏనాడు కాలేదిలా             నేడేదో జరిగిందిలే ! || ఏ || నీ   తోటి   నా   పరిచయం               నా   వెంట   నీ   జ్ఞాపకం నిలిచింది   నా   గుండెలో                  నడిపింది   నీ   మాయలో ! అది   చేసె   ప్రతి   సవ్వడీ                అల   లాగ   నా   గుండెలో రేపింది   ఓ   అలజడీ                రాయంటి   నా   మనసులో ! || ఏ || కన్నుల్లో   నీ   రూపమూ                  కను   మరుగు   కానీయక కను   వాల్చనంటున్నదీ                కునుకైన   రానీయక ! ఊహల్లో   నీ   ఊసులూ                ఉయ్యాల   జంపాలలా ఊరించి   ఉండిపోకా                 ఉప్పెనై   ఊపిరాపే ! || ఏ || ఏనాడూ   ఎరుగనిదిదీ                 ఏమై   ఉంటుందదీ ప్రేమే   అనుకుందునా                ప్రియురాలు   నీవందునా ! || ఏ ||

కరోనాసుర కరాళ నృత్యం

  విపరీత   బుద్ధుల   వినాశనం కరోనాసుర   కరాళ   నృత్యం ప్రళయం   అంచున   ప్రపంచం ప్రజల   మనుగడే   ప్రశ్నార్థకం ! అభివృద్ది   మాటున   అడ్డదారులో పోటీతత్వ   ప్రతిఫలమో ఏదైనా   కారణం   ఎవరైనా కనివిని   ఎరుగని   కల్లోలం ! ఖాళీ   లేని   ఆసుపత్రులు   ఖననం   కొరకు   శవాల   గుట్టలు   అవకాశం లేని అంత్యక్రియలు నరుల జీవితం నరకప్రాయం! నాటి   రోజుల   మేటి   జీవనంకై ఎదురుచూపులు  ఎన్నాళ్ళో కలుగునా   కరోనాసుర   సంహారం మిగులునా   మానవాళికి   సంతోషం !

వేషభాషలందు తెలుగు లెస్స!

  వేషభాషలందు   తెలుగు   లెస్స ! విలువతో   వెలకట్టలేని  “ అ ” మ్మను   అక్షరాదితో   గౌరవించిన   గొప్ప   భాష ! అందంగా   చీరకట్టు   హుందాగ   పంచెకట్టు వన్నె   తెచ్చిన   సంప్రదాయ   వస్త్రకట్టు ! కవిత్రయ   శైలి   కవి  సార్వభౌముడి   భాణి వేమన   శతకాలు   జానపద   గీతాలు తెలంగాణ   తేట   సీమ   రోష   మాట పసందైన  తెలుగు   పదనిసలు ! పట్టు   పరికిణి   పాదాలకు   పట్టీలు చేతికి   గాజులు   చెవులకు   జూకాలు నుదుటిన   బొట్టు   నెత్తిన   పూలు పదహారణాల   తెలుగు   పరిమళం ! మన   భాషా   మన   వేషం మన   గుర్తింపు   మన   గౌరవం !

నన్నుగన్న నా పల్లె

  ననుగన్న   నా   పల్లె   నిను   మరువలేను   నేమరిచిపోను ||న|| తొలకరి   వానల   మట్టి   వాసనలు మిణుగురు   పురుగుల   రాత్రి   వెలుగులు పైరు   పంటల   పిల్ల   గాలులు నాలో   రేపెను   నిన్నటి   ఊహలు  || న || నాలుగు   వీధులు   నూరు   గడపలు మనసు   కలిగిన   మంచి   మనుషులు బోనాల   సందడి   బతుకమ్మ   మాయమ్మ ఏమని   చెప్పను   ఎంతని   చెప్పను  || న || కట్టెల   పొయ్యి   దీపపు   వెలుతురు   నులుగు   మంచాలు   డప్పు   చప్పుల్లు గునె   పెంకులు   గడ్డి   వాములు ఈతాకు   చాపలు   తాటాకు   పందిళ్ళు  || న || చిక్కటి   పాలు   చక్కటి   పెరుగు తాటి   ముంజలు   ఈత   పళ్ళు చేదబావి   నీరు   ఊరబావి   ఈత కలుషితమన్నది   కానరాదెన్నడు  || న ||

ధర్మనిరతి

  అధర్మ   పక్షాన   అన్నదమ్ములునూరైనా ఉపయోగమేల   ఉప్పునీటివోలె ! ధర్మనిరతి   తోడ   ఒక్కడైనను   చాలు మత్తగజంబుల   మదమనర్చగ !

షడ్రుచుల ఉగాది శుభాకాంక్షలు

  తీపి   మాటలన్నీ   తియ్యగానుండునా కటువు   చేష్టలన్నీ   కాఠిన్యమగునా ఒగరు   చూపులన్నీ   ఒక్కతీరగునా ఉప్పుకర్పూర   రుచులు   ఉండునా   ఒక్కటిగా పులుపు   కూరకై   పొరుగింట   చూసినా చేదు   జ్ఞాపకాలు   చివరికంటా   మిగులుగా !