ఎళ్ళిపోవె కరోనా నువ్వెళ్ళిపోవె కరోనా

 

ఎళ్ళిపోవె కరోనా నువ్వెళ్ళిపోవె కరోనా

ఎళ్ళిపోయి మల్లెప్పుడు రామాకే కరోనా

పిలవని పేరంటంలా పనికట్టుక వస్తివి

చైనా గోడను దాటి చేరినావే ఈడన ||||


మా ఎండకి మా వేడికి నీ పని ఖతమని

నువ్వేమీ పీకవని నీ ఆటలు సాగవని 

కాకుంటే లేకుంటే మందుగోలి చాలునని 

బలాదూరు తిరిగినాముమాస్కులేమి లేకుండ ||||


అంచనాలు మారిపోయే ఆపదేమో ముంచుకొచ్చే

వాడు దగ్గె వీడు తుమ్మె ఆడ ఈడ అడ్డగోలుగ

వాడినుంచి వీడికొచ్చె వీడినుంచి వాడికొచ్చె

ఒకరొకరికి అంటుకుంటు ఊరంత గత్తరెక్కె 

||||


రోగమంటు నొప్పి అంటు దవాఖానకెళ్ళినాక

రకరకాల పరిక్షలతో జేబు గుల్ల చేసిండ్రు

బెడ్డులేవి లేవంటూ బయటకు పంపిండ్రు

ప్రాణవాయువందక పాణం పోయేట్టుంది!

||||

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రాజకీయాలు

మన హైదరాబాదు