పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

నా చిట్టి తల్లి

చిత్రం
  నా   చిట్టి   తల్లి   నా   చిట్టి   తల్లి నీ   రాక   తోటి   నా   లోకం   మారెనులే నాకెంతో   అందంగా   కనపడెనులే ! నా   చేతుల్లో   తొలి   సారి   నిను   తీసుకున్నపుడు నను   నేను   మరిచానులే   నిను   చూస్తూ   మురిసానులే !  ॥ నా॥ నీ   చిన్ని   పాదాలు   నా   ఎదను   తన్నంగ గిలిగింత   కలిగెనులే నా   తనువంతా   పులకించెనులే ! నీ   నోట   తొలి   మాట   నా   చెవిని   తాకంగ   సరిగమలు   వినిపించెనులే నా   మదిని   అలరించెనులే !  ॥ నా॥ నువ్వేసిన   తొలి   అడుగు నువు   దిద్దిన   తొలి   అక్షరం నేనెప్పుడూ   మరవనులే నాకు   కలకాలం   గుర్తుండునులే ! నీ   ఉండ   నా   చెంత   నా   చింత   మాయం ఏ   మాయ   చేశావోలే   మొత్తంగా   ఏ   మంత్రమేశావోలే !  ॥ నా॥   నా   లోకమంతా   నీవే   ఉండగా ఘడియలు   క్షణమాయెనులే గమ్మత్తుగా   కాలమే   కరిగిపోయెనులే ! నీ   ప్రతి   పుట్టిన   రోజు   నా   మట్టుకు నీ   తొలి   పుట్టిన   రోజేలే  …  నా   కంటికి   నీవెప్పుడూ   పసి   పాపవే !  ॥ నా॥

లతా మంగేష్కర్

  అమృతం   తాగిన   వారు   దేవతలు   దేవుళ్ళు అది   శ్రోతలకు   పంచిన   వారు   గాన   గంధర్వులు ! గానామృతాన్ని   గ్రోలిన   శ్రోతలకు   మరుపెక్కడిది ఆ   గాత్ర   శిఖామణులకు   మరణమెక్కడిది ! కాలగర్భంలో   కలిసిపోవు   అందరూ కలకాలం   గుర్తుండిపోవు   కొందరు !