పోస్ట్‌లు

సెప్టెంబర్, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

ఏమిటీ ఘోరం! ఎవరిదీ పాపం!!

  చెరువులు   మాయం   అడవులు   మాయం భూబకాసురుల   ఆకలి   తీరక   కొండగుట్టలు   మాయం   మాయం ప్రభుత్వ   పెద్దల   అండ   ఉండగా అవినీతి   అధికారుల   సాయమందగా అక్రమాలకు   అడ్డేలేక   అడ్డగోలుగ   కట్టెను   ఇండ్లు ఉష్ణోగ్రతలు   పెరిగిపోగా ఋతుపవనాలు   అలిగిపోగా అల్పపీడనాలు   ఏర్పడుచుండగా అకాల   వానలు   పడుతుండగా   దిక్కు   తోచక   వరద   నీరు దారి   పొడుగునా   పారెను   చెరువై దారిన   పోయే   సగటు   జీవి   తెరిచిన   నాళా   కనపడకుండగ తెలియక   వేసే   అడుగు   ముందుకు విగత   జీవిగా   మారెను   చూడు ఏమిటీ   ఘోరం !  ఎవరిదీ   పాపం !!