ఏమిటీ ఘోరం! ఎవరిదీ పాపం!!
తినే తిండి కలుషితం
తీసుకునే గాలి కలుషితం
తాగే నీరు కలుషితం
వినే మాట కలుషితం
చూసే దృశ్యం కలుషితం
కలుషిత బుర్రలో పుట్టే ఆలోచనలు కలుషితం
చెప్పే మాట కలుషితం
చూపే దృశ్యం కలుషితం
కలుషితానికి కాదేదీ అనర్హం
కలి యుగం కాదిది కలుషిత యుగం!
——-
చెరువులు మాయం అడవులు మాయం
భూబకాసురుల ఆకలి తీరక
కొండగుట్టలు మాయం మాయం
ప్రభుత్వ పెద్దల అండ ఉండగా
అవినీతి అధికారుల సాయమందగా
అక్రమాలకు అడ్డేలేక
అడ్డగోలుగ కట్టెను ఇండ్లు
ఉష్ణోగ్రతలు పెరిగిపోగా
ఋతుపవనాలు అలిగిపోగా
అల్పపీడనాలు ఏర్పడుచుండగా
అకాల వానలు పడుతుండగా
దిక్కు తోచక వరద నీరు
దారి పొడుగునా పారెను చెరువై
దారిన పోయే సగటు జీవి
తెరిచిన నాళా కనపడకుండగ
తెలియక వేసే అడుగు ముందుకు
విగత జీవిగా మారెను చూడు
ఏమిటీ ఘోరం! ఎవరిదీ పాపం!!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి