పోస్ట్‌లు

మే, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

మనస్పర్ధలను కలుపు మొక్కలు

  పండంటి   జీవిత   పంట   పొలములో నాటుకపోయిన   నమ్మకలేమికి   అపార్థాలు   ఆయువు   కాగా   మొలకలెత్తులే   మనస్పర్ధలు ! కలుపు   మొక్కలను   కూకటివేళ్ళ పెరికివేయక   పెంచిన   ఎడల సారము   లేని   సాగుగ   మారి పంట   మొత్తము   పాడైపోవును !

కాలమా కాసేపు ఆగుమా!

  నింగిని   కమ్మిన   మేఘం   మేఘం   కురిపించిన   చినుకులు తొలకరి   చినుకుల   మట్టి   వాసనలు తనువును   తట్టిన   మునపటి   గుర్తులు కనుల   విందుగా   ఈ   చిత్రమండగా కాలమా   కాసేపు   అలా   ఆగుమా!

నాన్న ఒక భరోసా నాన్న ఒక బలం

  నడక   నేర్పటం   నుంచి   నడవడిక   నేర్పు   వరకు నీకు   నీవుగా   నిలదొక్కుకొనే   వరకు   నిరంతరం   నీ   వెన్ను   తట్టి   నీడల   నీ   వెంట   నుండు   నాన్న   ఒక   భరోసా   నాన్న   ఒక   బలం! శిలలాంటి   నిన్ను   శిల్పం   చేయ   ఉలి   దెబ్బలేసే మాట   ఎంత   కటువైనా   మనసు   మాత్రం   వెన్న అమ్మ   లాగా   అక్కున   చేర్చుకోడేమో   అయినా నాన్న   ఒక   భరోసా   నాన్న   ఒక   బలం! నీ   ఇష్టాలను   నీ   దరి   చేర్చ కష్టం   ఎంతున్నా   కాదనడు బాధ   ఎంతైనా   భరిస్తాడు నాన్న   ఒక   భరోసా   నాన్న   ఒక   బలం!

కలవర బోకురా బిడ్డా

  ఆగపడకురా   వారీ అన్ని   సర్దుకుంటాయి   గానీ కలకాలం   కరోనా   ఉండబోదురా కలవర   బోకురా   బిడ్డా ! పని   మీద   ఏడికి   పొయినా పక్కోడిని   అంటకు   ముట్టకు మూతి   ముక్కుకి   చుట్టు   గుడ్డని ముట్టినంటనే   కడుగు   చేతుల ! గ్రాచారం   బాలేక   సుస్తైతే గాయి   గత్తర   చేయబోకురా ఖతమేమి   చేయదురా   కరోనా కాసింత   దిమాకు   పెట్టరా ! ఇంటికాడనే   ఉండరా ఇచ్చిన   గోలీలు   మింగరా పదిహేను   దినాలు   పక్కకుండగా పట్టిన   కరోనా   పాణం   పోవురా ! || ఆ ||

మనసు నిండుగ నీవు ఉండగ

  నిన్ను   చూసిన   మొదట   చూపులో నాకు   కమ్మే   మైకమేదో మనసు   నిండుగ   నీవు   ఉండగ మరిచిపోయా   నన్ను   నేను! రోజు   మొత్తం   ధ్యాస   నీదై రాసుకుంటిని   ఊసులెన్నో దొంగలెవరు   దోచకుండ దాటుకుంటిని   మనసులోనా ! మనసులోని   మాటలేమో   పెదవి   దాటకున్నవి మాట   రాక   మూగబోయే   మనసులోని   ఊసులు కనులనేమో   సాయమడగ   చెప్పలేమని   చూపు   తిప్పే కనికరాన   మనసు   తట్టి   మూగబాసను   పట్టలేవా ? ————- అదే   నేల   అదే   నింగి   అనాదిగా   ఉందీ   స్నేహం మధ్యలో   వచ్చిన   మేఘం   తనతో   తెచ్చిన   వర్షం నింగిని   మరిపిన   కానీ   నేలను   తడిపిన   కానీ కాలచక్రంలో   కొన్నాళ్ళే   కలిగించు   అవరోధం   కమ్మిన   మేఘం   కరుగును   తడిసిన   నేల   ఎండును అదే   నేల   అదే   నింగి   అనాదిగా   ఉందీ   స్నేహం !

మాతృదేవోభవ

  నవ   మాసాలు   కడుపులో   దాచి నీ   ఊపిరితో   నా   ఊపిరి   నింపి ప్రపంచానికి   నేనెవరో   చూప పురిటినొప్పికి   పులకరించితివి ! బొజ్జనింపి     బుజ్జగించి   బుద్దులెన్నో   బోధ   చేసి   ప్రపంచాన్ని   చూప   నాకు ప్రథమ   గురువు   నీవైతివి ! నీ   ఒడిలో   వెచ్చదనం నీ   మాటలో   చల్లదనం నీ   ప్రేమలో   స్వచ్ఛతనం నీ   తోడే   నాకు   జయం ! నాది   అన్న   ప్రతి   క్షణం నీవు   పెట్టిన   భిక్ష   నాకు నీవు   లేక   నేను   లేను నీ   రుణం   నే   తీర్చలేను !

నీరో చక్రవర్తులు నేటి మన నేతలు

  నీరో   చక్రవర్తులు   నేటి   మన   నేతలు దేశం   తగలడుతుంటే   దర్జాగా   ఎన్నికలు ముందుచూపంతా   రేపటి   అధికారంపైనే మన   గురించి   పట్టని   మూర్ఖ   శిఖామణులు ! గల్లీ   నుంచి   ఢిల్లీ   వరకు   ఎన్నికలేవైనా గెలిచేది   వారే   మనకు   మాత్రం   ఓటమే కరోనా   కట్టడికి   కానరాని   ముందుచూపు నమ్ముకున్న   మనలను   నట్టేట   ముంచుతారు ! అతివిశ్వాసం   తోడ   అనాలోచిత   పనులు అసమర్థతను   దాచేను   అబద్దపు   ప్రచారాలతో   నూరు   తప్పులైనా   క్షమించాం   ఈ   శిశుపాలుల నిలదీసేద్దాం   ఇకనైన   నీతి   లేని   ఈ   నేతలను !

ఓడిద్దాం కరోనాని

  గతమెంతో   చేసేను ఘోరమైన   యుద్ధాలు మరణాయుధాలతో   మట్టుబెట్ట   శత్రువులను ఒళ్ళు   అలవగ   పోరాడే   ఒక్కటై   అందరూ రణరంగమందున   రక్తము   చిందించగా ! కనపడని   కరోనాతో   చేసే   ఈ   యుద్ధంలో ప్రతి   వాడు   సైనికుడే   ప్రతి   ఇల్లు   కదనరంగమే చేసేద్దాం   ఈ   యుద్ధం   చేయి   చేయి   కలపక ఓడిద్దాం   కరోనాని   ఒళ్ళు   అలవక   ఇల్లు   కదలక !

రాజకీయ ప్రక్షాళన

రాజకీయం   ఒక   బురద   గుంట తామరపువ్వులు   ఉండవిక్కడ కులం   పేరుతో   మతం   పేరుతో కంపు   కొడుతుంది   రాజకీయం ! రౌడీయిజం   వారసత్వం రాజకీయాన   రెండు   కళ్ళు అవినీతన్నది   ముఖ్యార్హత అక్కరలేదింకే   అర్హత ! పైసలుంటే   పదవి   వచ్చు పదవితోటి   పెత్తనమోచ్చు పెత్తనమున   పెరుగును   ఆస్తులు తరతరాల   తరగని   కొండలు ! దొరకని   వరకు   అందరు   దొరలే దొరికినంతనే   సాకులు   చూపులే నీతి   మాటలు   చెప్పే   నేతలు నేతి   బీర   కాయల   మాదిరి ! దశాబ్దాల   ఘణతంత్రానికి వారసత్వమనే   జాడ్యం   పట్టే ప్రజాస్వామ్య   పెద్దన్న   దేశాన అవినీతికి   అగ్ర   తాంబూలం! పెరిగిపోయే   ఈ   బురద   కంపు ముక్కు   మూసుకొన   ఇంకెన్నాళ్ళు పదండి   ముందుకు   శుభ్రం   చేయగ మన   ఓటే   మన   ఆయుధమవగ ! విలువలు   లేని   నేతలందరు విషం   కక్కే   త్రాచు   పాములు ప్రజా   శ్రేయస్సు   పట్టని   వారు   పరిపాలనకు   అర్హులు   కారు !  ప్రలోభాలకు   లొంగక   మనం ప్రతిభావంతుల   గెలిపించ్చేద్దాం ప్రజాస్వామ్య   విలువలు   పెంచి ప్రపంచానికి   దిక్సూచి   అవుదాం !

కరోనాతో అసువులు బాసిన కష్టజీవి ఆత్మఘోష

  ఏమి   ఘోరము   ఏమి   నరకము   రా ఈ   మాయదారి   కరోనా   తో ఏమి   ఘోరము   ఏమి   నరకము   రా ! ఇక్కడక్కడ   అంటు   కాక   అంతటా   వ్యాపించి   తాను   ఇక్కట్లు   పెంచె   మనకు   ఇప్పుడు   రా ! || ఏ || బయటకెళ్ళా   భయము   వేసి కానరానీ   కరోనాతో బ్రతుకు   భారము   అయినదిప్పుడు   రా ! పస్తులుంచక   భార్య   పిల్లల పిడికెడన్నం   పెట్టు   కొరకు పనికి   పోతిని   భయము   భయముగ   రా ! || ఏ || రోజు   మొత్తం   పడిన   కష్టము రెండు   పూటల   కడుపు   నింపగ అలసిపోయి   నిదుర   పోతిని   రా !  నీరసంగా   ఒంటి   నొప్పి   తో   ఆసుపత్రికి  నేను   వెళితే   కరోనాని   నాకు   తెలిసెను  రా ! || ఏ || ఎవడి   నుంచో   ఎక్కడి   నుంచో   ఎలా   వచ్చెనో   ఏదీ   తెలియక ఆఘమాఘం   మనసు   అయెను   రా ! ఇంటికున్న   ఒక్క   గదిలో   ఐసొలేషన్   వీలుకాక ఆసుపత్రి   అండ   కోరితి   రా ! || ఏ || పడక   మంచం   ఎదురుచూపున పట్టనీ   ఆ   వైద్య   మందున వ్యాధి   ముదిరి   ఊపిరాగెను   రా !  అయిన   వారి   చూపు   కందక అనాథ శవమై  నా  ఆత్మ ఘోష   పడినదిప్పుడు   రా ! || ఏ ||

మా పల్లె రోదన చూడు

  మా   ఊరు   పల్లెటూరు మా   పల్లె   పిలిచెను నేడు! పైరు   పంట   సోయగాలు పిల్ల   గాలి   చక్కిలిగింతలు తరతరాల   అనుబంధాలు తరిగిపోని   జ్ఞాపకాలు ఊహల   ఉయ్యాలలూగ ఊసులెన్నో   చెప్పుటకని వేగిరమే   రెక్కలు   కట్టి వేకువనే   చేరుకుంటిని ! కలలన్నీ   కల్లలు కాగా కటిక   నిజం   కంట   పడెగా ! సాయపడని   భోరు   బావి సాగు   లేక  బీడు   భూమి అన్న దాత   ఆకలి   ఘోష ఆలకించ   ఎవరున్నారు మట్టి   మనిషి   ఉపాధేమో మచ్చుకైనా   కానరాక వేరు   దారి   లేనెలేక వలస   జీవి  బ్రతుకైపోయే ! రైతే   రాజన్న   మాట ఒట్టి   మాట   నీటి   మూట! పైరు   పంట   నాటి   పొలము ప్లాటులుగా   మారెను   నేడు నమ్ముకున్న   నేల   తల్లిని నేడు   పెట్టే   అమ్మకానికి బ్రతుకిచ్చిన   మా   పల్లె బలై   పోయె   ఈ   రోజు తన   వారు   ఎవ్వరు   లేక తల్లడిల్లే   తనలో   తానే ! మా   ఊరు   పల్లెటూరు మా   పల్లె   రోదన   చూడు !