నాన్న ఒక భరోసా నాన్న ఒక బలం

 

నడక నేర్పటం నుంచి నడవడిక నేర్పు వరకు

నీకు నీవుగా నిలదొక్కుకొనే వరకు నిరంతరం 

నీ వెన్ను తట్టి నీడల నీ వెంట నుండు 

నాన్న ఒక భరోసా నాన్న ఒక బలం!


శిలలాంటి నిన్ను శిల్పం చేయ ఉలి దెబ్బలేసే

మాట ఎంత కటువైనా మనసు మాత్రం వెన్న

అమ్మ లాగా అక్కున చేర్చుకోడేమో అయినా

నాన్న ఒక భరోసా నాన్న ఒక బలం!


నీ ఇష్టాలను నీ దరి చేర్చ

కష్టం ఎంతున్నా కాదనడు

బాధ ఎంతైనా భరిస్తాడు

నాన్న ఒక భరోసా నాన్న ఒక బలం!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రాజకీయాలు

మన హైదరాబాదు