పోస్ట్‌లు

సెప్టెంబర్, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

మధుసూదన ద్విశతకం

#117 ఓర్పు   నేర్పులలో   మనకన్నా   మిన్న వారు   లేనిదే   మనమన్నది   సున్న స్వాగతిద్ధాము   వారిని   సాధికారతనిచ్చి మనసు   పెట్టి   వినరా   మధుసూదనా ! #116 ఎదురు   చూస్తున్నావంటు   వెంటనే   రాదు తప్పించుక   తిరగ   చూడ   తరలి   పోదు నూకలు   చెల్లంగనే   నిన్నెత్తుకెళ్ళు   చావు మనసు   పెట్టి   వినరా   మధుసూదనా ! #115 తాళియంటే   తాడు   కాదు   తెంపి   పారవేయ విప్పడానికి   కాదు   వేసింది   మూడు   ముడులు విడిపోవు   మనస్పర్థలు   విచక్షణతో   చర్చించిన మనసు   పెట్టి   వినరా   మధుసూదనా ! #114 చేయకూడని   పనిని   చేయమాకెప్పుడూ చూచులే   అంతరాత్మ   చూడకున్ననెవరూ అపరాధమన్నది   అగ్గిలా   దహించును మనసు   పెట్టి   వినరా   మధుసూదనా ! #113 విలువ   లేదని   సున్నాను   వెలకట్టకుందుమా పక్కనుండి   సంఖ్య   విలువ   పదింతలు   చేయునే ఉన్నతి   కోరే   వ్యక్తుల   వేలెన్నడూ   విడువకు మనసుపెట్టి   వినరా   మధుసూదనా ! #112 సరదా   పరిచయాలు   సాగిస్తే   అలవాటుగా అదుపు   తప్పిపోయి   ఆపదలు   తెచ్చిపెట్టు బానిస   కాకముందే   బంధనాలు   తెంచుకో మనసుపెట్టి   వినరా   మధుసూదనా ! #111 పురుగు   గొంగళి   నుంచి   పుట్టిన   సీతాకోక చేరదీయ