పోస్ట్‌లు

జులై, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

నేటి సమాజ వింత పోకడ

అమ్మనాన్నలు వద్దే వద్దు అత్త మామల ఊసే వద్దు మేమిద్దరం మాకిద్దరితో చింతలేని చిన్న కుటుంబం! కలిసి ఉంటే కలదు దుఃఖమను నేటి సమాజ ఈ వింత పోకడ నేర్పునేమి భావి తరాలకు? మంచి విలువలు మసకబారే మనసు నిండుగ మాలిన్యమే! ఓర్పు లేని ఈ జీవితాన  చిన్న తప్పే పెద్ద నేరం! —— ఓర్పు   లేదు   ఓర్వలేము అహంకారపు   అంధకారం కలిసి   ఉంటే   కలుగు   దుఃఖమనె ఉమ్మడి   కుటుంబమా ,  నీ   ఊసెక్కడా ! ——- మనిషి మారినాడు  ఆతని మనసు మారినాది! మంచి విలువలు మసకబారే మనసు నిండుగ మాలిన్యమేలే! పేరు కోసం ప్రాకులాడే అడ్డ దారిలో అడుగులేసే! పాపభీతి లేకపోయే సంఘనీతి మరిచిపోయే! స్వార్థ చింతన సొంత లాభం కుటిల బుద్ది కుంచిత త్వం! మనిషి మారినాడు  ఆతని మనసు మారినాది! —— ప్రజాసేవంటు  ప్రగల్భాలు పట్టవు  ప్రజాసమస్యలు మాకు! నీతులెన్నో   నినదించేస్తాం అవినీతిలో   అగ్రగాములం ! మాటలకు   మర్యాద   రామన్నలం అన్యాయాలకు   అధికారులం ! అమ్మవారులని   ఆరాధిస్తాం ఆడవారిపై   అకృత్యాలు   ఆపం ! “ అన్నదాత   సుఖీభవ ”  అంటాం అన్నదాతల   ఆకలి   తీర్చం ! భిన్నత్వంలో   ఏకత్వ   భీరాలుపోతాం భారతీయతను   భ్రష్టుపట్టిస్తాం ! ——- ప్రేయసి కళ్ళలో నింగిసంద్రాలనెతికేవాడా! కన్నవారి

కలగూర గంప

  నేను కవిని కాదు కవిత్వం రాయడానికి నేను జ్ఞానిని కాదు సూక్తిబోధ చేయడానికి ఛందోరీతి లేదు నా రాతకి తపోశక్తి లేదు నా మాటకి సమాజమే నా గురువు సమాజమే నా ప్రేరణ సమాజమే నా విషయఖని సమాజమే నా దోరణి సమాజ విషయాలను సామాన్య ప్రజకు సరళముగా విన్నవించాలనేదే నా తపన!  ——- అధర్మ   పక్షాన   అన్నదమ్ములునూరైనా ఉపయోగమేల   ఉప్పునీటివోలె ! ధర్మనిరతి   తోడ   ఒక్కడైనను   చాలు మత్తగజంబుల   మదమనర్చగ !  ——- విజ్ఞానము   పెరిగిపోయే   విచక్షణ   తరిగిపోయే ఆలోచన   లేకపోయే   అడవులు   కరిగిపోయే ! పరిసరాలు   కలుషితమాయే   ప్రకృతి   కోపగించే ప్రపంచానికి   మూడినట్టే   పద్దతి   మారకుంటే !  —— నీ   రూపు   మధురం   నీ   రుచి   మధురం   నీవుండ   నా   ఇంట   నా   వంట   పండే పప్పు   చేసిన   కానీ   పచ్చడైనను   కానీ కూర   వండిన   కానీ   చారు   చేసిన   కానీ   సలాడులో   నీవే   సాండ్విచ్చులో   నీవే అగ్రతాంబూలంబు   అన్ని   కాయగూరల్లో ! ఆహా   అంటున్నామని   అలుసై   పోతిమా దరి   చేరలేనంత   ధర   లెందుకమ్మా బెట్టు   వదిలి   మా   బుట్టలో   చెరమ్మా కమ్మనీ   వంటయై   కంచంలో   రావమ్మా మాయమ్మ   టమాట   మమ్ము   కరుణించమ్మా ! ——— నీకన్నా   తోపెవ్వడూ   నీ

నిర్భయ

  పూటకో   ఉన్మాది   పుట్టుకొస్తుండే ఆడబిడ్డల   ఉసురు   ఆరిపోతుండే ! మరణ   శాసనమే   మృగాలకు   మందు తప్పు   తలిస్తే   తడిచిపోవాలి   మున్ముందు !  ——- పదవులు   పలుకుబడి   మెండుగానుండినా చట్టాల   లోపాలు   చుట్టాలు   అగునులే ! మృగాలుగా   మారి   మానం   హరించిన బాలురంటూ   అందించు   బెయిలును !  —— దిక్కు   తోచని   లేడిపిల్ల   దిక్కెవరంటూ   ఎదురు   చూడగా మాటు   వేసిన   మృగాలు   నాలుగు మానం   హరించి   ప్రాణం   తీస్తే గగ్గోలెట్టని   హక్కుల   సంఘం గొల్లుమనెను   మృగాల   వధించగ మృగాలకెందుకు   మానవ   హక్కులు ? ——— కాటు   వేస్తాడొకడు   కామంతో అంతం   చేస్తాడొకడు   అనుమానంతో ప్రాణం   తీస్తాడొకడు   ప్రేమంటూ   కాల్చుకు   తింటాడొకడు   కట్నమంటూ ఆడది   అంటే   అబల   అనుకొని మృగాలు   గా   మారిన   మగాళ్ళ కోరలు   పీక   కాళికా   మాతగా అవతరించ   అవసరమిప్పుడు ! ———— “ మహిళలపై   హింస   నిర్మూలన   దినోత్సవం ” చప్పట్లు   కొట్టి   చేతులు   దులుపుకొంటాం నిర్భయా   దిశలు   నిరంతరం   చూస్తుంటాం చిత్తశుద్ధి   లేని   చేతలెప్పుడూ   అబలలపై   ఆకృత్యాలు   ఆపవెప్పుడూ ! ——- చేసేవన్నీ   పెద్ద   తప్పులు తొడిగేస్తారు   మైనరు   ముసుగుల