నేటి సమాజ వింత పోకడ


అమ్మనాన్నలు వద్దే వద్దు
అత్త మామల ఊసే వద్దు
మేమిద్దరం మాకిద్దరితో
చింతలేని చిన్న కుటుంబం!

కలిసి ఉంటే కలదు దుఃఖమను
నేటి సమాజ ఈ వింత పోకడ
నేర్పునేమి భావి తరాలకు?
మంచి విలువలు మసకబారే
మనసు నిండుగ మాలిన్యమే!
ఓర్పు లేని ఈ జీవితాన 
చిన్న తప్పే పెద్ద నేరం!
——


ఓర్పు లేదు ఓర్వలేము

అహంకారపు అంధకారం

కలిసి ఉంటే కలుగు దుఃఖమనె

ఉమ్మడి కుటుంబమానీ ఊసెక్కడా!

——-


మనిషి మారినాడు 
ఆతని మనసు మారినాది!

మంచి విలువలు మసకబారే
మనసు నిండుగ మాలిన్యమేలే!

పేరు కోసం ప్రాకులాడే
అడ్డ దారిలో అడుగులేసే!

పాపభీతి లేకపోయే
సంఘనీతి మరిచిపోయే!

స్వార్థ చింతన సొంత లాభం
కుటిల బుద్ది కుంచితత్వం!

మనిషి మారినాడు 
ఆతని మనసు మారినాది!
——


ప్రజాసేవంటు ప్రగల్భాలు

పట్టవు ప్రజాసమస్యలు మాకు!

నీతులెన్నో నినదించేస్తాం

అవినీతిలో అగ్రగాములం!

మాటలకు మర్యాద రామన్నలం

అన్యాయాలకు అధికారులం!

అమ్మవారులని ఆరాధిస్తాం

ఆడవారిపై అకృత్యాలు ఆపం!

అన్నదాత సుఖీభవ” అంటాం

అన్నదాతల ఆకలి తీర్చం!

భిన్నత్వంలో ఏకత్వ భీరాలుపోతాం

భారతీయతను భ్రష్టుపట్టిస్తాం!

——-

ప్రేయసి కళ్ళలో నింగిసంద్రాలనెతికేవాడా!
కన్నవారి కన్నీరు కానరాదా!
కమ్మిన మైకంలో ఉరుకులాట 
ఎండమావివెంట!
నిస్వార్ధ ప్రేమను మరిచితివా
నేల వీడి నింగి సాము చందంగా?
——

అపార్ధాలే ఆయువుగా పట్టింపులే ప్రాణంగా

తప్పటడుగులేస్తుంటే

ఎక్కడుంది విలువ ఏడడుగుల బంధానికి!


అపనమ్మక మాటలు అనాలోచిత చేష్టలు

అగ్నికి ఆజ్యంలా అనవసర రాద్దాంతం

పెంచును ఎడాన్ని పెకిలించును బంధాన్ని!


ఒకరితో ఒకరు ఒకరికై ఒకరని

చెప్పుకున్న ఊసులు చేసుకున్న బాసలు

బుట్టదాఖలేనా బుడిదపాలైన పన్నీరులా!


కారుమబ్బులైనా కరుగు కురిసే వానతో

మబ్బు పట్టిన కాపురాన మంచి రోజులు ఎప్పుడో!

——




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రాజకీయాలు

మన హైదరాబాదు