పోస్ట్‌లు

డిసెంబర్, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

సిరివెన్నెల సీతారామ శాస్త్రి

  పిచ్చి   కూతలు   పాడు   మాటలతో   పాడె   చేరిన   తెలుగు   పాటకు   ప్రాణం   పోసె ! సాహిత్య   సంపదే   తనకు  ‘ సిరి ’ యంటూ వినసొంపు   పాటల  ‘ వెన్నెల ’  కురిపించె ! ——— ఈశ్వరా !  బిచ్చగాడివని   బూడిదిస్తావని బింకమున   పలుకలే   బెట్టు   చేయనేల ! అసురులనే   అనుగ్రహించిన   భోళా   శంకరా దీర్ఘాయువు   ప్రసాదించ   దయ   లేక   పోయెనా ! ———— సినీ   ఆకాశంలో   పాటల   చందమామ విలువలున్న   సాహిత్య   వెన్నెలను   కురిపించే ! ఈర్ష్యయన్నది   పుట్టెనేమో   ఇంద్రునికిపుడు తెలుగు   వారినుంచి   తీసుకెళ్ళె   తనకడకు ! ———- అక్షరమే   నీ   ఊపిరి   అక్షరమే   ఆయుధము అక్షరాలతో   ఆటలు   పదాలతో   సరిగమలు వినసొంపు   మాటలు   విచ్చుకత్తి   వాక్యాలు సాటిలేని   సాహిత్యం   సిరివెన్నెల   సొంతం అక్షర   తపస్వీ   అందుకో   నా   అక్షర   నివాళి ! ——— నచ్చకుండెనా   అప్సరసల   నాట్య   భంగిమలు తెగ   నచ్చెనా   తెలుగు   సినిమా   ఆట   పాటలు కళామతల్లి   ముద్దుబిడ్డలపై   కన్నేశావా   సురపతి సమయము   కాదు   కళాపోషణకు సమరము   చేయు   కరోనాసురునితో !