సిరివెన్నెల సీతారామ శాస్త్రి

 

పిచ్చి కూతలు పాడు మాటలతో 

పాడె చేరిన తెలుగు పాటకు ప్రాణం పోసె!

సాహిత్య సంపదే తనకు ‘సిరియంటూ

వినసొంపు పాటల ‘వెన్నెల’ కురిపించె!

———

ఈశ్వరాబిచ్చగాడివని బూడిదిస్తావని

బింకమున పలుకలే బెట్టు చేయనేల!

అసురులనే అనుగ్రహించిన భోళా శంకరా

దీర్ఘాయువు ప్రసాదించ దయ లేక పోయెనా!

————

సినీ ఆకాశంలో పాటల చందమామ

విలువలున్న సాహిత్య వెన్నెలను కురిపించే!

ఈర్ష్యయన్నది పుట్టెనేమో ఇంద్రునికిపుడు

తెలుగు వారినుంచి తీసుకెళ్ళె తనకడకు!

———-

అక్షరమే నీ ఊపిరి అక్షరమే ఆయుధము

అక్షరాలతో ఆటలు పదాలతో సరిగమలు

వినసొంపు మాటలు విచ్చుకత్తి వాక్యాలు

సాటిలేని సాహిత్యం సిరివెన్నెల సొంతం

అక్షర తపస్వీ అందుకో నా అక్షర నివాళి!

———

నచ్చకుండెనా అప్సరసల నాట్య భంగిమలు

తెగ నచ్చెనా తెలుగు సినిమా ఆట పాటలు

కళామతల్లి ముద్దుబిడ్డలపై కన్నేశావా సురపతి

సమయము కాదు కళాపోషణకు

సమరము చేయు కరోనాసురునితో!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రాజకీయాలు

మన హైదరాబాదు