రాజకీయ ప్రక్షాళన


రాజకీయం ఒక బురద గుంట

తామరపువ్వులు ఉండవిక్కడ

కులం పేరుతో మతం పేరుతో

కంపు కొడుతుంది రాజకీయం!

రౌడీయిజం వారసత్వం

రాజకీయాన రెండు కళ్ళు

అవినీతన్నది ముఖ్యార్హత

అక్కరలేదింకే అర్హత!


పైసలుంటే పదవి వచ్చు

పదవితోటి పెత్తనమోచ్చు

పెత్తనమున పెరుగును ఆస్తులు

తరతరాల తరగని కొండలు!

దొరకని వరకు అందరు దొరలే

దొరికినంతనే సాకులు చూపులే

నీతి మాటలు చెప్పే నేతలు

నేతి బీర కాయల మాదిరి!


దశాబ్దాల ఘణతంత్రానికి

వారసత్వమనే జాడ్యం పట్టే

ప్రజాస్వామ్య పెద్దన్న దేశాన

అవినీతికి అగ్ర తాంబూలం!

పెరిగిపోయే  బురద కంపు

ముక్కు మూసుకొన ఇంకెన్నాళ్ళు

పదండి ముందుకు శుభ్రం చేయగ

మన ఓటే మన ఆయుధమవగ!


విలువలు లేని నేతలందరు

విషం కక్కే త్రాచు పాములు

ప్రజా శ్రేయస్సు పట్టని వారు 

పరిపాలనకు అర్హులు కారు

ప్రలోభాలకు లొంగక మనం

ప్రతిభావంతుల గెలిపించ్చేద్దాం

ప్రజాస్వామ్య విలువలు పెంచి

ప్రపంచానికి దిక్సూచి అవుదాం!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రాజకీయాలు

మన హైదరాబాదు