నీరో చక్రవర్తులు నేటి మన నేతలు

 

నీరో చక్రవర్తులు నేటి మన నేతలు

దేశం తగలడుతుంటే దర్జాగా ఎన్నికలు

ముందుచూపంతా రేపటి అధికారంపైనే

మన గురించి పట్టని మూర్ఖ శిఖామణులు!


గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎన్నికలేవైనా

గెలిచేది వారే మనకు మాత్రం ఓటమే

కరోనా కట్టడికి కానరాని ముందుచూపు

నమ్ముకున్న మనలను నట్టేట ముంచుతారు!


అతివిశ్వాసం తోడ అనాలోచిత పనులు

అసమర్థతను దాచేను అబద్దపు ప్రచారాలతో 

నూరు తప్పులైనా క్షమించాం  శిశుపాలుల

నిలదీసేద్దాం ఇకనైన నీతి లేని  నేతలను!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రాజకీయాలు

మన హైదరాబాదు