కరోనాతో అసువులు బాసిన కష్టజీవి ఆత్మఘోష

 

ఏమి ఘోరము ఏమి నరకము రా

 మాయదారి కరోనా తో

ఏమి ఘోరము ఏమి నరకము రా!

ఇక్కడక్కడ అంటు కాక 

అంతటా వ్యాపించి తాను 

ఇక్కట్లు పెంచె మనకు ఇప్పుడు రా! ||||


బయటకెళ్ళా భయము వేసి

కానరానీ కరోనాతో

బ్రతుకు భారము అయినదిప్పుడు రా!

పస్తులుంచక భార్య పిల్లల

పిడికెడన్నం పెట్టు కొరకు

పనికి పోతిని భయము భయముగ రా! ||||


రోజు మొత్తం పడిన కష్టము

రెండు పూటల కడుపు నింపగ

అలసిపోయి నిదుర పోతిని రా

నీరసంగా ఒంటి నొప్పి తో 

ఆసుపత్రికి నేను వెళితే 

కరోనాని నాకు తెలిసెను రా! ||||


ఎవడి నుంచో ఎక్కడి నుంచో 

ఎలా వచ్చెనో ఏదీ తెలియక

ఆఘమాఘం మనసు అయెను రా!

ఇంటికున్న ఒక్క గదిలో 

ఐసొలేషన్ వీలుకాక

ఆసుపత్రి అండ కోరితి రా! ||||


పడక మంచం ఎదురుచూపున

పట్టనీ  వైద్య మందున

వ్యాధి ముదిరి ఊపిరాగెను రా

అయిన వారి చూపు కందక

అనాథ శవమై 

నా ఆత్మఘోష పడినదిప్పుడు రా! ||||

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రాజకీయాలు

మన హైదరాబాదు