కలవర బోకురా బిడ్డా

 

ఆగపడకురా వారీ

అన్ని సర్దుకుంటాయి గానీ

కలకాలం కరోనా ఉండబోదురా

కలవర బోకురా బిడ్డా!


పని మీద ఏడికి పొయినా

పక్కోడిని అంటకు ముట్టకు

మూతి ముక్కుకి చుట్టు గుడ్డని

ముట్టినంటనే కడుగు చేతుల!


గ్రాచారం బాలేక సుస్తైతే

గాయి గత్తర చేయబోకురా

ఖతమేమి చేయదురా కరోనా

కాసింత దిమాకు పెట్టరా!


ఇంటికాడనే ఉండరా

ఇచ్చిన గోలీలు మింగరా

పదిహేను దినాలు పక్కకుండగా

పట్టిన కరోనా పాణం పోవురా! ||||

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రాజకీయాలు

మన హైదరాబాదు