మాతృదేవోభవ

 

నవ మాసాలు కడుపులో దాచి

నీ ఊపిరితో నా ఊపిరి నింపి

ప్రపంచానికి నేనెవరో చూప

పురిటినొప్పికి పులకరించితివి!


బొజ్జనింపి  బుజ్జగించి 

బుద్దులెన్నో బోధ చేసి 

ప్రపంచాన్ని చూప నాకు

ప్రథమ గురువు నీవైతివి!


నీ ఒడిలో వెచ్చదనం

నీ మాటలో చల్లదనం

నీ ప్రేమలో స్వచ్ఛతనం

నీ తోడే నాకు జయం!


నాది అన్న ప్రతి క్షణం

నీవు పెట్టిన భిక్ష నాకు

నీవు లేక నేను లేను

నీ రుణం నే తీర్చలేను!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రాజకీయాలు

మన హైదరాబాదు