మనసు నిండుగ నీవు ఉండగ

 

నిన్ను చూసిన మొదట చూపులో

నాకు కమ్మే మైకమేదో

మనసు నిండుగ నీవు ఉండగ

మరిచిపోయా నన్ను నేను!


రోజు మొత్తం ధ్యాస నీదై

రాసుకుంటిని ఊసులెన్నో

దొంగలెవరు దోచకుండ

దాటుకుంటిని మనసులోనా!


మనసులోని మాటలేమో పెదవి దాటకున్నవి

మాట రాక మూగబోయే మనసులోని ఊసులు

కనులనేమో సాయమడగ చెప్పలేమని చూపు తిప్పే

కనికరాన మనసు తట్టి మూగబాసను పట్టలేవా?

————-

అదే నేల అదే నింగి అనాదిగా ఉందీ స్నేహం

మధ్యలో వచ్చిన మేఘం తనతో తెచ్చిన వర్షం

నింగిని మరిపిన కానీ నేలను తడిపిన కానీ

కాలచక్రంలో కొన్నాళ్ళే కలిగించు అవరోధం 

కమ్మిన మేఘం కరుగును తడిసిన నేల ఎండును

అదే నేల అదే నింగి అనాదిగా ఉందీ స్నేహం!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రాజకీయాలు

మన హైదరాబాదు