నా చిట్టి తల్లి

 



నా చిట్టి తల్లి నా చిట్టి తల్లి
నీ రాక తోటి నా లోకం మారెనులే

నాకెంతో అందంగా కనపడెనులే!


నా చేతుల్లో తొలి సారి 

నిను తీసుకున్నపుడు

నను నేను మరిచానులే 

నిను చూస్తూ మురిసానులేనా॥


నీ చిన్ని పాదాలు 

నా ఎదను తన్నంగ

గిలిగింత కలిగెనులే

నా తనువంతా పులకించెనులే!


నీ నోట తొలి మాట 

నా చెవిని తాకంగ 

సరిగమలు వినిపించెనులే

నా మదిని అలరించెనులేనా॥


నువ్వేసిన తొలి అడుగు

నువు దిద్దిన తొలి అక్షరం

నేనెప్పుడూ మరవనులే

నాకు కలకాలం గుర్తుండునులే!


నీ ఉండ నా చెంత 

నా చింత మాయం

 మాయ చేశావోలే 

మొత్తంగా  మంత్రమేశావోలేనా॥ 


నా లోకమంతా నీవే ఉండగా

ఘడియలు క్షణమాయెనులే

గమ్మత్తుగా కాలమే కరిగిపోయెనులే!


నీ ప్రతి పుట్టిన రోజు నా మట్టుకు

నీ తొలి పుట్టిన రోజేలే … నా కంటికి 

నీవెప్పుడూ పసి పాపవేనా॥

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రాజకీయాలు

మన హైదరాబాదు