మారుదాము ఇకనైన మార్పు తీసుకొద్దాము

 

మారము మనము మారము మనము

మంచి మాటలెప్పుడూ తలకెక్కవు మనకు!


కరోనా మహమ్మారి నలుమూలల కమ్ముతున్న

కానరాదు మనలోన ఉండాల్సిన క్రమశిక్షణ!

మనకేమీ కాదన్న మితిమీరిన నమ్మకంతో

ఉత్సవాలు చేస్తాము ఊరేగుతు ఉంటాము!

||మా||


మాస్కులేసుకుంటాము మూతి ముక్కు కానరాగ

గుంపులుగ వెళుతాము గొర్రెల మందలుగ!

పనీపాట లేకున్నా పచారాలు చేస్తాము

మహమ్మారి కరోనాని మన వెంట తెస్తాము!

||మా||


ఒళ్ళు గుల్ల ఇల్లు గుల్ల ఒంటరిగా మన బ్రతుకు

ఇమ్యూనిటి లేకపోతే ఐసీయు లో మన పడక!

ప్రాణవాయువు అందకా ....

ప్రాణవాయువు అందక

ప్రాణం పోయిందంటే

చుట్ట కట్టి కాల్చేస్తరు చివరి చూపు లేకుండ!


మారుదాము ఇకనైన మార్పు తీసుకొద్దాము

మనకోసమే కాకుండా మనవారి కోసమంటు!

పాటిద్దాం నియమాలను తు.తప్పకుండగ

పనిపడదాం మహమ్మారి పీడ విరగడైపోగ!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రాజకీయాలు

మన హైదరాబాదు