కరోనాసుర కరాళ నృత్యం

 

విపరీత బుద్ధుల వినాశనం

కరోనాసుర కరాళ నృత్యం

ప్రళయం అంచున ప్రపంచం

ప్రజల మనుగడే ప్రశ్నార్థకం!


అభివృద్ది మాటున అడ్డదారులో

పోటీతత్వ ప్రతిఫలమో

ఏదైనా కారణం ఎవరైనా

కనివిని ఎరుగని కల్లోలం!


ఖాళీ లేని ఆసుపత్రులు 

ఖననం కొరకు శవాల గుట్టలు 

అవకాశం లేని అంత్యక్రియలు

నరుల జీవితం నరకప్రాయం!


నాటి రోజుల మేటి జీవనంకై

ఎదురుచూపులు ఎన్నాళ్ళో

కలుగునా కరోనాసుర సంహారం

మిగులునా మానవాళికి సంతోషం!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రాజకీయాలు

మన హైదరాబాదు