నమ్మకమున్నది నాకెంతో

 

మానవాళిపై దురాక్రమణ 

మనుగడ కోసం పోరాటం

చరిత్ర నేర్పన పాఠాలుండగ

చింతించాల్సిన అవసరమేల!


పదండి ముందుకు ప్రణాళికతో

పోరాడేద్దాం కరోనాతో

కలసికట్టుగ అందరు చేరగ

కదనరంగమున మనదే విజయం!


క్రమశిక్షణతో కార్యదీక్షతో

కొండలనైనా పిండిచేయగల

మెండుగ ఉన్న గుండె ధైర్యముతో

మహమ్మారిని జయించేద్దాం!


నమ్మకమున్నది నాకెంతో

నాటి రోజుల మేటి బ్రతుకులు

రేపటి రోజున ఉదయిస్తాయని

రేపు అన్నది దూరము లేదని!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రాజకీయాలు

మన హైదరాబాదు