నా గుండె లోతుల్లో


ఏదో అయ్యిందిలే

           నాకేదో అయ్యిందిలే

ఏనాడు కాలేదిలా

          నేడేదో జరిగిందిలే! ||||

నీ తోటి నా పరిచయం

            నా వెంట నీ జ్ఞాపకం

నిలిచింది నా గుండెలో 

             నడిపింది నీ మాయలో!

అది చేసె ప్రతి సవ్వడీ

             అల లాగ నా గుండెలో

రేపింది  అలజడీ

             రాయంటి నా మనసులో! ||||

కన్నుల్లో నీ రూపమూ 

             కను మరుగు కానీయక

కను వాల్చనంటున్నదీ

             కునుకైన రానీయక!

ఊహల్లో నీ ఊసులూ

             ఉయ్యాల జంపాలలా

ఊరించి ఉండిపోకా

              ఉప్పెనై ఊపిరాపే! ||||

ఏనాడూ ఎరుగనిదిదీ

              ఏమై ఉంటుందదీ

ప్రేమే అనుకుందునా

             ప్రియురాలు నీవందునా! ||||

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రాజకీయాలు

మన హైదరాబాదు