రామా కనవేమయా!

 

రామా కనవేమయా 

రఘురామ కనవేమయా ...

రామా కనవేమయా!


 రాకాసి కరోనాని 

అది చేసే విలయాన్ని

 జనుల బాదను 

ఇకనైన ఆపేయ ||రా||


నీ యందు భక్తితో 

 భక్త సందోహం

 బాదలెంతున్న 

నీ సేవ మానలే!

 లోటు రాకుండా 

ఏమారి పోకుండా

నీ పూజ చేశారు 

 నవమి నాడు! ||రా|| 


నీ పేరు అనుకుంటే 

 కీడు రాదన్న

నీ కథలు విన్నాము 

 కనులైతే కనలేదు!

నీ మహిమ చూపెట్టు 

నీ వారి దయతోడ

నీ శరము గురిపెట్టు 

 రాకాసి వథ పట్టు! ||రా||

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రాజకీయాలు

మన హైదరాబాదు