నన్నుగన్న నా పల్లె

 

ననుగన్న నా పల్లె 

నిను మరువలేను నేమరిచిపోను ||న||


తొలకరి వానల మట్టి వాసనలు

మిణుగురు పురుగుల రాత్రి వెలుగులు

పైరు పంటల పిల్ల గాలులు

నాలో రేపెను నిన్నటి ఊహలు ||||


నాలుగు వీధులు నూరు గడపలు

మనసు కలిగిన మంచి మనుషులు

బోనాల సందడి బతుకమ్మ మాయమ్మ

ఏమని చెప్పను ఎంతని చెప్పను ||||


కట్టెల పొయ్యి దీపపు వెలుతురు 

నులుగు మంచాలు డప్పు చప్పుల్లు

గునె పెంకులు గడ్డి వాములు

ఈతాకు చాపలు తాటాకు పందిళ్ళు ||||


చిక్కటి పాలు చక్కటి పెరుగు

తాటి ముంజలు ఈత పళ్ళు

చేదబావి నీరు ఊరబావి ఈత

కలుషితమన్నది కానరాదెన్నడు ||||

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రాజకీయాలు

మన హైదరాబాదు