ఘోరకళి


కోరలు చాచిన కరోనాగ్నిలో

ఊపిరి ఆడక ఉసురుపోయిన

విగత జీవుల విషాద గాధలు

ఆప్తులు చేసే ఆక్రందనలు!


ఒకటా రెండా వందలు వేలు

ఒకటిగ పేర్చిన శవాల గుట్టలు

వల్లకాడే నా వల్లకాదంటూ

వైరాగ్యం వీడి విలపించెను నేడు!


ఎవరిదీ పాపం ఎందుకీ శాపం

ఇంకెన్నాళ్ళూ  ఘోరకళి

బ్రతుకు ఆశలు బరువైతుండగ

అలిసిన గుండె ఆగిపోనుందిగ!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రాజకీయాలు

మన హైదరాబాదు