మునుపటి రోజులు

 

నాటి రోజులు గుర్తుకొచ్చెలే

నేటితో నాటికి పోలిక లేదులే!

అస్సలు లేదు చదువు ఒత్తిడి

ఆటలు లేవు మట్టి ముట్టక!

చేతిలో లేదు స్మార్ట్ ఫోను

చురుకుగా ఉండే బుర్రెప్పుడూ

వల్లె వేసాము ఎక్కాలను

వద్దకు రాలే మతిమరుపన్నదేనా।

కాలి నడకనే ఎక్కడికైనా

కావలిసినంతా సమయముండెలే

టీవీ ఉన్నా ఒకటే ఛానల్

టైం వేస్టుకు ఛాన్స్ తక్కువే!

ఉత్తరాలతో యోగక్షేమం

ఆత్రానికి ఆమడ దూరం!

బాటిల్ నీళ్ళ ఊసే లేదు

బాగుగా ఉండే బావిలో నీళ్ళేనా।

అల్పాహారం అప్పుడప్పుడు

అన్ని వేళల అన్నం మాత్రమే!

పిజ్జా బర్గర్ అంటే తెలియదు

పండగలప్పటి పిండివంటలే!

పెద్దలంటే భయం భక్తి

పెద్దల మాటకు ఎదురు చెప్పలే!

నాటి రోజులు గుర్తుకొచ్చెలే

నేటితో నాటికి పోలిక లేదులే!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రాజకీయాలు

మన హైదరాబాదు