మధుసూదన శతకం
#117 ఓర్పు నేర్పులలో మనకన్నా మిన్న వారు లేనిదే మనమన్నది సున్న స్వాగతిద్ధాము వారిని సాధికారతనిచ్చి మనసు పెట్టి వినరా మధుసూదనా ! #116 ఎదురు చూస్తున్నావంటు వెంటనే రాదు తప్పించుక తిరగ చూడ తరలి పోదు నూకలు చెల్లంగనే నిన్నెత్తుకెళ్ళు చావు మనసు పెట్టి వినరా మధుసూదనా ! #115 తాళియంటే తాడు కాదు తెంపి పారవేయ విప్పడానికి కాదు వేసింది మూడు ముడులు విడిపోవు మనస్పర్థలు విచక్షణతో చర్చించిన మనసు పెట్టి వినరా మధుసూదనా ! #114 చేయకూడని పనిని చేయమాకెప్పుడూ చూచులే అంతరాత్మ చూడకున్ననెవరూ అపరాధమన్నది అగ్గిలా దహించును మనసు పెట్టి వినరా మధుసూదనా ! #113 విలువ లేదని సున్నాను వెలకట్టకుందుమా పక్కనుండి సంఖ్య విలువ పదింతలు చేయునే ఉన్నతి కోరే ...