పోస్ట్‌లు

జులై, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

నేటి సమాజ వింత పోకడ

అమ్మనాన్నలు వద్దే వద్దు అత్త మామల ఊసే వద్దు మేమిద్దరం మాకిద్దరితో చింతలేని చిన్న కుటుంబం! కలిసి ఉంటే కలదు దుఃఖమను నేటి సమాజ ఈ వింత పోకడ నేర్పునేమి భావి తరాలకు? మంచి విలువలు మసకబారే మనసు నిండుగ మాలిన్యమే! ఓర్పు లేని ఈ జీవితాన  చిన్న తప్పే పెద్ద నేరం! —— ఓర్పు   లేదు   ఓర్వలేము అహంకారపు   అంధకారం కలిసి   ఉంటే   కలుగు   దుఃఖమనె ఉమ్మడి   కుటుంబమా ,  నీ   ఊసెక్కడా ! ——- మనిషి మారినాడు  ఆతని మనసు మారినాది! మంచి విలువలు మసకబారే మనసు నిండుగ మాలిన్యమేలే! పేరు కోసం ప్రాకులాడే అడ్డ దారిలో అడుగులేసే! పాపభీతి లేకపోయే సంఘనీతి మరిచిపోయే! స్వార్థ చింతన సొంత లాభం కుటిల బుద్ది కుంచిత త్వం! మనిషి మారినాడు  ఆతని మనసు మారినాది! —— ప్రజాసేవంటు  ప్రగల్భాలు పట్టవు  ప్రజాసమస్యలు మాకు! నీతులెన్నో   నినదించేస్తాం అవినీతిలో   అగ్రగాములం ! మాటలకు   మర్యాద   రామన్నలం అన్యాయాలకు   అధికారులం ! అమ్మవారులని   ఆరాధిస్తాం ఆడవారిపై   అకృత్యాలు   ఆపం ! “ అన్నదాత   సుఖీభవ ”  అంటాం అన్నదాతల   ఆకలి ...