పోస్ట్‌లు

మన హైదరాబాదు

  ఏ దిక్కు వారైనా ఏ దిక్కు లేకున్నా అక్కున చేర్చుకొని ఆకలి తీర్చే అవకాశాల అక్షయపాత్ర భాగ్యమొసగే మన భాగ్యనగరం! —— ఆకాశం మొగులేసే  ఆగకుండా వాన కురిసే సడకులన్నీ సంద్రమాయే వాహనాలూ నత్త నడకే కాస్త పయణమూ గగనమాయే! —— అక్రమార్కులు చెరువులని ఆక్రమించే బహుళ అంతస్తులు బాగుగా నిర్మించే దిక్కు తోచని వరద దారులెంట పారే భాగ్య నగర వాసుల భాగ్యమేమందుమో! ——- ఆ దొర పోయి ఈ దొర వచ్చే ఢాం ఢాం ఢాం మాస్టర్ ప్లాను మారి పోయే ఢాం ఢాం ఢాం భాగ్యం కోసం భాగ్య నగరాన ఢాం ఢాం ఢాం పాట్లుబడి ప్లాట్లు కొన్నవారు ఢాం ఢాం ఢాం ధగా పడెను దొరల పంతానికి ఢాం ఢాం ఢాం! —— చుట్టుముట్టూ   చూపు   తిప్పుకోలేని   ఆకాశహర్మ్యాలు నట్టనడుమ   పంచ   శతాబ్ధాల   కట్టడాలు కొత్త   పోకడల   నడుమ   పదిలముగ   పాత   జ్ఞాపకాలు   విభిన్న   మతాల   వివిధ   రాష్ట్ర   వాసుల   సంగమం నిజమైన   భారతీయం   మన   హైదరాబాదు ! ————- అటు   చూస్తే   ఆకాశ   హర్మ్యాలు ఇటు   చూస్తే   ఇరుకైన   బస్తీలు అబ్బుర   పరిచే   నెక్లెస్ ...

కలగూర గంప

  కడుపు నింపే కంచంలో అన్నం  రేయి పగలు రైతన్నల కష్టం! ప్రతి గింజపై తినేవాడి పేరుండే పండించే రైతన్నల పెత్తనం లేకుండే? —— ఆగని ఆలోచనల సుడిగుండాలు మనసును కమ్మేసే కారు చీకట్లు! ఓపిక పట్టు నేస్తమా, వస్తుంది రాత్రి చీకట్లు చీల్చే రేపటి ఉదయం! —— గుర్రమెక్కిన మనసు  కళ్లెం వేయకుంటే  గుడ్డిగా పరిగెట్టు కలతలే మిగిలేట్టు! —— రెండు హృదయాలను కలిపే రెండు అక్షరాల పదం! అక్షరాలు రెండే అయినా అనుభూతి అనిర్వచనీయం! —— కుంభమేళాలు, వైకుంఠ ద్వారాలు ప్రీమియర్ షోలు, పార్టీల సభలు పదండి తోసుకు, పదండి తోసుకు  పోదాం పోదాం ప్రాణం పోయే వరకు!                                                                                                                    ...