స్వాతంత్ర్యం
ఒంటరిగా ఆడది కంట పడితే చాలు మధమెక్కి మృగాడు మానం హరిస్తుండే! భారతమా, నీకు స్వరాజ్యమొచ్చినదే కానీ బాపూజీ కలల స్వాతంత్ర్యం రాలేదు సుమీ! —— పంద్రాగస్టు పండగ అనగా పరాయి పాలన అంతమనేనా! స్వాతంత్ర్య సమరయోధుల తలంపు కనగా స్వరాజ్య సుపరిపాలన స్పురణకు రాదా! చూసావా స్వరాజ్యమా, చట్ట సభల్లో అవినీతి పరులు నేరచరితులెందరే! చెప్పమ్మా స్వరాజ్యమా, కళంకిత పాలకులతో ఆ త్యాగధనుల కల నెరవేరేనా! —— వర్తకమంటూ వచ్చి వంచనతో పంచన చేరి విడగొట్టి పడగొట్టి విర్రవీగె వలసవాదులు ! తల్లి భారతి తల్లడిల్లగ తనయులంతా ఒక్కటవ్వగ బయటికొచ్చే భారతీయత బద్దలాయే పరాయి పాలన ! మెరిసేను రాజ్యాంగం మేధావుల మెధోమధనంతో మురిసేను గణతంత్రమై స్వాతంత్ర్య భారతావని ! —— కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు బెంగాలు నుంచి బొంబాయి వరకు ఉప్పొంగిన భారతీయత ఉక్కు పిడికిలై వెళ్ళగొట్టే వలసవాదుల వెన్ను విరిచి ! ——...