గణతంత్రం

 

వర్తకమంటూ వచ్చి వంచనతో పంచన చేరి

విడగొట్టి పడగొట్టి విర్రవీగె వలసవాదులు!

తల్లి భారతి తల్లడిల్లగ తనయులంతా ఒక్కటవ్వగ

బయటికొచ్చే భారతీయత బద్దలాయే పరాయి పాలన!

మెరిసేను రాజ్యాంగం మేధావుల మెధోమధనంతో

మురిసేను గణతంత్రమై స్వాతంత్ర్య భారతావని!

——

కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు

బెంగాలు నుంచి బొంబాయి వరకు

ఉప్పొంగిన భారతీయత ఉక్కు పిడికిలై

వెళ్ళగొట్టే వలసవాదుల వెన్ను విరిచి!

——

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రాజకీయాలు

మన హైదరాబాదు