మాతృభాష
ఎవరు కూర్చారు చిన్నారికి
మొదటి పద వరుసలను?
చిన్నారికి జన్మనిస్తే అమ్మ
పదాలకి జన్మనిచ్చే అమ్మభాష!
గోరుముద్దల భాష
పలికించు అలవోకగా!
సవతి తల్లి మాయలో
పెదవి చాటు పడుందా?
కాలేదు కన్న తల్లి
సవతి తల్లి ఏనాడూ!
అమ్మను వదిలేస్తామా
అవసరం లేదంటూ?
మాతృభాషను మరిచెదమా
మరి ఉపయోగం కాదంటూ?
అమ్మ ప్రేమ మాధుర్యం
అందించే ఆ భాష
మరువకు ఏనాటికి
సొంతమైన నీ భాష!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి